పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును హల్లెలూయ - యేసు చాలును హల్లెలూయ
యే సమయమైన యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును
సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను ||యేసు||
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను ||యేసు||
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
భార్యా భర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
బంధుమిత్రులయందు - వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
ధరణిలోన ప్రేమలన్నియు - స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
జారిపోకుండా - నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||
కృంగిన వేళ - ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2)
మరువగలనా - నీ మధుర ప్రేమను (2)
యేసు నా జీవితాంతము (2) ||చేయి||
లోక సంద్రము - నాపై ఎగసినా
విశ్వాస నావలో - కలవరమే రేగినా (2)
నిలువ గలనా - ఓ నిముషమైనను (2)
యేసు నా చేయి విడచినా (2) ||చేయి||
మనసంతా నీవే - ఊహల్లో నీవే
కనుపాపలో నీవే - నా జీవం నీవే
నరనరములో నీవే - నా సర్వం నీవే
హృదయంలో నీవే - యెసయ్యా నీవే
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా
కరుణించే దేవుడవూ - ప్రేమించే దేవుడవు
నీ ప్రేమ విడువనిదీ - నీ ప్రేమ మరువనిది
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా
నీవే నా గీతము - నీవే సంగీతము
నాదు జీవితము - నీకే అర్పింతును
నా పెదవులపై - ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో - నీకే ఆరాధనా