పల్లవి లెక్కించ లేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నే పాడెదన్ (2) ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై (2) || లెక్కించ|| చరనం 1 ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న సర్వంబును (2) భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ|| చరనం 2 అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును (2) భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును (2) || లెక్కించ|| చరనం 3 నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు (2) ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ|| Lyrics: Rev. T.D. Mathews
Telugu Lyrics
Telugu lyrics will be posted in this section of the website
కృపామయుడా నీలోనా
పల్లవి కృపామయుడా - నీలోనా (x2) నివసింప జేసినందుకు - ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ||కృపా|| చరనం 1 ఏ అపాయము నా గుడారము - సమీపించ నీయక నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయ మైనందున ||కృపా|| చరనం 2 చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా రాజవంశములో - యాజకత్వము చేసెదను ||కృపా|| చరనం 3 నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా|| చరనం 4 ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను ||కృపా||
ఇల్లలోన పండగంట
లలలాలలల లలలలల……. లలాలలలల లలలలల పల్లవి ఇల్లలోన పండగంట – కల్ల్లలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచుజల్లి – మందిరాన కురిసెనేడు ఎందుకే ఎందుకే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల – అవతార పురుశుడంట వెన్నెల (x2) అవతరించినాడంట వెన్నెల – ఈ అవనిలోనంట వెన్నెల ||ల ల|| చరనం 1 ఏ ఊరు ఏ వాడ ఏ దిశను పుట్టినాడే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా (x2) యూదా దేషమందు వెన్నెల – బెత్లెహేము గ్రామమందు వెన్నెల (x2) రాజులకు రాజంట వెన్నెల – ఈ లోకాన్ని యేలునంట వెన్నెల ||ల ల|| చరనం 2 ధూప దీప హారములతొ వచ్చినారు ఎవరే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల (x2) తూర్పు దేశపు ఙ్ణానులంట వెన్నెల – దర్శించ వచ్చినారే వెన్నెల(2) బంగారు సాంబ్రాని భోళం – తెచ్చినారు మొక్కినారు వెన్నెల ||ల ల||
జుంటి తేనె కన్నా
చరనం 1 జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి యేసు నీ నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండలకన్నా చల్లనిది యేసు నీ నామము పల్లవి యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నీ శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మొ్రక్కెదము చరనం 1 జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి యేసు నీ నామము చరనం 2 ఆకాశముకన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించియున్నది ఊహలకనందని ఉన్నతమైనది యేసు నీ నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరిని బ్రతికించు జీవము సర్వ కాలములో నివసించు సత్యము యేసు నీ నామము చరనం 1 జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి యేసు నీ నామము యేసు నీ నామము Album: Lerevaru Singers: Alan Ganta & Ankitha Music: Joel Kodali & Hadlee Xavier
ఇదిగో దేవా నా జీవితం
పల్లవి ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2) ||ఇదిగో|| చరనం 1 పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి (x2) అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం ||ఇదిగో|| చరనం 2 నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు (x2) ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| చరనం 3 విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు (x2) క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా ||ఇదిగో||
ఇదే దినం (This is the Day)
ఇదే దినం - ఇదే దినం ప్రభు చేసినది - ప్రభు చేసినది ఉత్సాహించి - ఉత్సాహించి స్తుతి పాడెదము - స్తుతి పాడెదము ఇదే దినం - ప్రభు చేసినది ఉత్సాహించి - స్తుతి పాడెదము ఇదే దినం - ఇదే దినం ప్రభు చేసినది
హల్లెలూయ యేసు ప్రభున్
చరనం 1 హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి పల్లవి రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి చరనం 2 తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి ||రాజుల|| చరనం 3 సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి ||రాజుల|| చరనం 4 యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి ||రాజుల|| చరనం 5 అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||
హల్లెలూయ స్తుతి మహిమ
పల్లవి హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లపుడు దేవునికిచ్చెదము (x2) ఆ...హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (x2) ||హల్లెలూయ|| చరనం 1 అల సైన్యములులకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (x2) అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము (x2) ||హల్లెలూయ|| చరనం 2 ఆకాషము నుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (x2) బండనుండి మధుర జలమును పంపిన - ఆ దేవుని స్తుతించెదము (x2) ||హల్లెలూయ||
ఎందుకో నన్నింతగా నీవు
పల్లవి ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య ||ఎందుకో|| చరనం 1 నా పాపము బాప - నరరూపి వైనావు నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (x2) ||ఎందుకో|| చరనం 2 నీ రూపము నాలో - నిర్మించియున్నావు నీ పోలికలోనే - నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (x2) ||ఎందుకో|| చరనం 3 నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (x2) ||ఎందుకో|| చరనం 4 నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (x2) ||ఎందుకో|| చరనం 5 నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (x2) ||ఎందుకో||
ఇమ్మానుయేలు రక్తము
చరనం 1
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును
పల్లవి
యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా (x2)
చరనం 2
ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు||
చరనం 3
నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును ||యేసుండు||
చరనం 4
నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్ ||యేసుండు||
చరనం 5
నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే ||యేసుండు||