పల్లవి యెహోవా నీ నామము - ఎంతో బలమైనది (2) ఎంతో బలమైనది ||యెహోవా|| చరనం 1 మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి ||యెహొవా|| చరనం 2 నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి ||యెహొవా|| చరనం 3 సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము ||యెహొవా|| చరనం 4 చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను ||యెహొవా|| చరనం 5 పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె ||యెహొవా||
Telugu Lyrics
Telugu lyrics will be posted in this section of the website
స్తుతియించెదా నీ నామం
పల్లవి స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2) దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2) ||స్తుతి|| చరనం 1 పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి|| చరనం 2 సిలువే నాదు శరణం - నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు - నిను నే విడువనేసు ||స్తుతి||
సిల్వలో నాకై కార్చెను
పల్లవి సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2) చరనం 1 సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2) చరనం 2 సమాధాన పరచును - యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2) చరనం 3 నీతి మంతులుగా చేయును - యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) నిభందన నిలుపును రక్తము - యేసు రక్తము (2) చరనం 4 రోగములను బాపును - యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును - యేసు రక్తము (2) యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)
శుద్ధా హృదయం
పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (3) చరనం 1 నీ వాత్సల్యం నీ బాహూల్యం - నీ కృప కనికరం చూపించుము (2) పాపము చేసాను - దోషినై యున్నాను (2) తెలిసియున్నది నా ఆతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే (2) నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా నీ సన్నిధిలో - నా పాపములే - ఒప్పుకొందునయా పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| చరనం 2 నీ జ్ఞానమును నీ సత్యమును - నా అంతర్యములొ పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం - నీ రక్షణానందం (2) కలుగచేయుము నా హృదయములో - కలుగచేయుము నా హృదయములో (2) నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా నీ సన్నిధిలో - పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయా పల్లవి శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) నాలోనా - నాలోన (2) ||శుద్ధా|| Tag ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా - శుద్ధి హృదయమే...... ఓ.. ఓ.. ఓ.. జీసస్ - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ.. ఓ...ఓ..ఓ..ఓ.. - ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ముగుంపు శుద్ధా హృదయం - కలుగ జేయుము (2) కలిగించుమయా - ఓ జీసస్
ప్రేమించెదన్ అధికముగా (More Love More Power)
పల్లవి ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (2) పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) చరనం 1 ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2) ఇంతవరకు ఆదుకొన్నావు నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన|| చరనం 2 ఎల్‌రోయీ ఎల్‌రోయీ - నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన|| చరనం 3 యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
రమ్మానుచున్నాడు
పల్లవి రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభుయేసు వాంచతో తన కరము చాపి - రమ్మానుచున్నాడు చరనం 1 ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు ||రమ్మాను|| చరనం 2 కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్ కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును ||రమ్మాను|| చరనం 3 సొమ్మసిల్లు వేలలో - బలమును నీ కిచ్చును ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ||రమ్మాను|| చరనం 4 సకల వ్యాధులను - స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ ||రమ్మాను||
ఓరన్నా ఓరన్నా
పల్లవి ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చరనం 1 చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా) పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా) అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2) ||ఓరన్నా|| చరనం 2 పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా) నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా) పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్నా|| చరనం 3 సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా) మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా) మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్నా|| చరనం 4 మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా) మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా) మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2) ||ఓరన్నా||
నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును, యేసు
నిన్నే ప్రేమింతును
నే వెనుతిరుగా
నీ సన్నిధిలొ మోకరించీ
నీ మార్గములొ సాగెదా
నిరసించక సాగెదా
నీ వెలుతురులో ||నీ సన్నిధిలొ||
నిన్నే సేవింతును
నిన్నే సేవింతును, యేసు
నిన్నే సేవింతును
నే వెనుతిరుగా
నీ సన్నిధిలొ మోకరించీ
నీ మార్గములొ సాగెదా
నిరసించక సాగెదా
నీ వెలుతురులో ||నీ సన్నిధిలొ||
నిన్నే స్తుతియింతును
నిన్నే స్తుతియింతును, యేసు
నిన్నే స్తుతియింతును
నే వెనుతిరుగా
నీ సన్నిధిలొ మోకరించీ
నీ మార్గములొ సాగెదా
నిరసించక సాగెదా
నీ వెలుతురులో ||నీ సన్నిధిలొ||
నిన్నే పూజింతును
నిన్నే పూజింతును, యేసు
నిన్నే పూజింతును
నే వెనుతిరుగా
నీ సన్నిధిలొ మోకరించీ
నీ మార్గములొ సాగెదా
నిరసించక సాగెదా
నీ వెలుతురులో ||నీ సన్నిధిలొ||
నీవు చేసిన ఉపకారములకు
పల్లవి నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును ఏడాది కోడెలనా - వేలాది పొట్టేళ్ళెనా (2) చరనం 1 వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా (2) గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| చరనం 2 మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో (2) కరుణ చూపి నీ ప్రేమ మార్గాన - నడిపించితివి యేసయ్యా (2) ||ఏడాది|| చరనం 3 విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునా (2) రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించెదను (2) ||ఏడాది|| చరనం 4 గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నేనేమి చెల్లింతును (2) కపట వర్తన లేకున్న హృదయాన్ని - అర్పింతునో యేసయ్యా (2) ||ఏడాది||
నీవే నా ఊపిరి (This is the Air I Breathe)
నీవే నా ఊపిరి
నీవే నా ఊపిరి
నీ సన్నిధియే - నాకు జీవం ||నీవే ఊపి||
నీవే.......నా కొరిక నీవే
నేవే..... నా ఆశ నీవే
నీవే జీవాహరం
నీవే జీవాహరం
నీ వాక్యము - నాకు జీవం ||నీవే జీవా||
నీవే......నా కొరిక నీవే
నీవే.... నా ఆశ నీవే