పల్లవి
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య ||ఎందుకో||
చరనం 1
నా పాపము బాప - నరరూపి వైనావు
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (x2) ||ఎందుకో||
చరనం 2
నీ రూపము నాలో - నిర్మించియున్నావు
నీ పోలికలోనే - నివసించమన్నావు
నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (x2) ||ఎందుకో||
చరనం 3
నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (x2) ||ఎందుకో||
చరనం 4
నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (x2) ||ఎందుకో||
చరనం 5
నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (x2) ||ఎందుకో||
Like this:
Like Loading...
Related
Hi,
Where are the chords?????????
You are not sending chords since last few songs.
Hi Jessi,
The chords are under the chords page. This lyrics page is dedicated for lyrics only. I got many requests to post just the lyrics to help the singers so, I am in the process of updating the lyrics page.
Blessings,
Vijay