నీవే నా ప్రాణము

పల్లవి

నీవే నా ప్రాణము - నీవే నా సర్వము 
నీవే నా జీవము - యేసయ్యా (2) 
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం (2)           ||నీవే||
 
చరనం 1
 
మార్గం నీవే - సత్యం జీవం నీవే
జీవించుటకు - ఆధారం నీవే (2)
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను అరాధింతున్ (2)       ||నీవే||

చరనం 2

తోడు నీవే - నా నీడ నీవే
నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2)
అపాయం రాకుండ కాపడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2)      ||నీవే||

హిందీ

తూహి మేరా జీవన్ - తూహి మేరా జహా
తూహి సబ్సే జుదా - ఈశు (2)

ఇంగ్లీష్

యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2)

నీవే నా దేవుడవు

నీవే నా దేవుడవు - ఆరాధింతును
నీవే నా రాజువు - కీర్తించెదను (2)

మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే
మరణమునుంచి జీవముకు - నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి
చీకటి నుంచి వెలుగనకు - నను నడిపించావు

హోసన్నా  మహిమ నీకే
హోసన్నా  ప్రభావము రాజునకే  (2)

నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)

నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి

నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పిచేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము  (2)

చరనం 1

అంధకార లోయలోన - సంచరించిన భయము లేదు
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు   (2)

చరనం 2  

ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  (2)

చరనం 3

ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్  (2)

నడిపించు నా నావ

పల్లవి

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప          ||నడిపించు||

చరనం 1

నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము          ||నడిపించు||

చరనం 2

రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ          ||నడిపించు||
 
చరనం 3

ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు           ||నడిపించు||
 
చరనం 4

ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట         ||నడిపించు||

చరనం 5

ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు       ||నడిపించు||

నా యేసయ్యా నా రక్షకా

నా యేసయ్యా - నా రక్షకా 
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
ప్రేమింతును నీ సన్నిధానమును  – కీర్తింతును యేసయ్యా   (2)

నా విమొచకుడా - నా పొషకుడా 
నా నమ్మదగిన దేవా - కీర్తింతును
ప్రేమింతును నీ సన్నిధానమును  – కీర్తింతును యేసయ్యా   (2)

నా స్నేహితుడా - నా సహయకుడా 
నా నమ్మదగిన దేవా - కీర్తింతును 
ప్రేమింతును నీ సన్నిధానమును – కీర్తింతును యేసయ్యా    (2)

నా తండ్రి నీవే

ఓహొ ఓహొ ఓ...ఓహొ ఓహొ ఓ...ఓహొ ఓహొ ఓ...ఓ.. ఓ..   (2)

పల్లవి

నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే 
నా తండ్రి నీవే - నీవే                                   ||నా తండ్రి||

   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా         ||నా తండ్రి||

చరనం 1

నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి        (x2)
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను 
తగులకుండ కాచే నీ ప్రేమ   
       
   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా        ||నా తండ్రి||

చరనం 2
గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి       (x2)
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని 
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ 

   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
   యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా       ||నా తండ్రి||
  
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా  (4)

నా ప్రాణం నా సర్వం

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా           ||నా ప్రాణం||

    నా దోషములను క్షమించు దేవుడు
    నా వేదనలు తొలగించును
    కరుణ కటాక్షము కిరీటముగా
    ఉంచావు

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా          ||నా ప్రాణం||

    నీ ఆత్మతో నన్ను నింపావు
    నీ రక్షణ నాకిచ్చావు
    నీ కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు
    పరమతండ్రివి

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా         ||నా ప్రాణం||

నా నీతి నీవే

పల్లవి

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు - నీ కిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా
హలెలూయా ఆమేన్‌ హలెలూయా - హలెలూయా ఆమేన్‌ హలెలూయా   (x2)  ||నా నీతి||

చరనం 1

నాదీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా
నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు - నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా        ||హలె||    

చరనం 2

నా ప్రియులే నన్ను వెలివేసి నపుడు - నీవు చేరదీసావుగా
నా ప్రక్కనిలచి నను దైర్యపరచి - కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటు - ఓదార్పు నిచ్చావుగా
చాలయ్యా దేవా నీక్రుపయే నాకు - బ్రతుకంతయు పండుగా       ||హలె||

చరనం 3

నా ఊభిలోన నే చిక్కి నపుడు - నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి - నీవాక్కు నిచ్చావుగా 
నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి - నీ సాక్షిగా నిలిపావుగా         ||హలె||

నా జీవం నా సర్వం

Song: Naa Jeevam Naa Sarvam
Album: Naa Pranam
Singer, Lyricist, Composer: Kripal Mohan

పల్లవి

నా జీవం నా సర్వం నీవే దేవా   (x2)
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య              ||నా జీవం||

చరనం 

తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి 
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును         
నా జీవం నా సర్వం నీవే దేవా

నీవే నీవే నీవే దేవా

నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
నా జీవం నా సర్వం నీవే దేవా          (x4)

నాదు జీవమాయనే

పల్లవి

నాదు జీవమాయనే - నా సమస్తము
నా సర్వస్వము యేసుకే - నాదు జీవము
నాదు దైవము - దివి దివ్య తేజము (2)              || నాదు  ||

చరనం 1    
 
క్రుంగిన వేళ భంగపడిన వేళ  - నా దరికి చేరెను
చుక్కాని లేని నా నావవలె నుండ - అద్దరికి చేర్చును
ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2)              || నాదు  ||

చరనం 2

సాతాను బంధీనై కుములుచున్న వేళ - విడిపించె శ్రీ యేసుడే 
రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెనె
సాతానుని అనగ ద్రొక్క - అధికారం బలమిచ్చెను (2)       || నాదు ||

చరనం 3 

కారు మేఘాలెన్నో క్రమ్మిన వేళ  - నీతి సూర్యుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచినను - నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగి వచ్చును - తరలి ప్రభు నీతో (2)        || నాదు ||