నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యం - నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం - నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం - అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలం - నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం - నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం - బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) కేవలం నీదేనయ్యా (2) ||నాదంటూ||
YouTube Link (Note the video song is in a key of C)
https://youtu.be/OsxsRj8I5CE