పరమ జీవము నాకు నివ్వ

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ 
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును 
యేసు చాలును హల్లెలూయ - యేసు చాలును హల్లెలూయ
యే సమయమైన యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును 

సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను 
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను                 ||యేసు||

పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును 
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును    ||యేసు||

నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను 
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను              ||యేసు||

Share your feedback