చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
జారిపోకుండా - నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2)            ||చేయి||

కృంగిన వేళ - ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2)
మరువగలనా - నీ మధుర ప్రేమను (2)
యేసు నా జీవితాంతము (2)            ||చేయి||

లోక సంద్రము - నాపై ఎగసినా
విశ్వాస నావలో - కలవరమే రేగినా (2)
నిలువ గలనా - ఓ నిముషమైనను (2)
యేసు నా చేయి విడచినా (2)           ||చేయి||

YouTube Link
https://youtu.be/UmEzRJXNuBY

Share your feedback