ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

పల్లవి
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా

దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ  (2)  ||ఏ బాధ||

చరణం 1
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా
సాతానే శోధించినా - శత్రువులే శాసించినా
పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా               ||దిగులేల||

చరణం 2
పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా
కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా            ||దిగులేల||

YouTube Link
https://youtu.be/gKt5HOsOIVM

Share your feedback