ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి - బలవంతుడు లోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన - పునరుధ్ధానుడు రండి మన హృదయాలను - ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను - ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా సత్య స్వరూపి - సర్వాంతర్యామి సర్వాధికారి - మంచి కాపరి వేలాధి సూర్యుల - కాంతిని మించిన మహిమగలవాడు - మహాదేవుడు రండి మనమందరము - ఉత్సహ గానములతో ఆ దేవా దేవుని - ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా