ఓ సద్భక్తులార లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి - నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహాముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టే నేడు వేంచేసెన్ మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి - నీకు నమస్కరించి నీకు నమస్కరించి - పూజింతుము ఓ దూతలార ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి - నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహాముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్యమాయే నరరూపు నమస్కరింప రండి - నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహాముతో