పల్లవి రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభుయేసు వాంచతో తన కరము చాపి - రమ్మానుచున్నాడు చరనం 1 ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు ||రమ్మాను|| చరనం 2 కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్ కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును ||రమ్మాను|| చరనం 3 సొమ్మసిల్లు వేలలో - బలమును నీ కిచ్చును ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ||రమ్మాను|| చరనం 4 సకల వ్యాధులను - స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ ||రమ్మాను||