హల్లెలూయ యేసు ప్రభున్

చరనం 1
  
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చెర్యలను - తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి

 పల్లవి

రాజుల రాజైన యేసు రాజు - భూజనుల నేలున్
హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి

చరనం 2

తంబురతోను వీణతొను - ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాలములన్ - మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి         ||రాజుల||

చరనం 3
 
సూర్య చంద్రులార ఇలా - దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన - నాధుని స్తుతియించుడి      ||రాజుల||

చరనం 4 
 
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్ధలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి         ||రాజుల||

చరనం 5

అఘాదమైన జలములారా - దేవుని స్తుతియించుడి
ఆలలవలె సెవకులు - లేచిరి స్తుతియించుడి
దూతలరా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి         ||రాజుల||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s