నడిపించు నా నావ

పల్లవి

D                 A        D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
   Bm        G      A       D
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప          ||నడిపించు||

చరనం 1

  D       Bm      A          G
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
  A     G      D     Bm       A   D
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
D                  A       D
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
   Bm        G      A      D
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము          ||నడిపించు||

చరనం 2

రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ          ||నడిపించు||
 
చరనం 3

ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు           ||నడిపించు||
 
చరనం 4

ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట         ||నడిపించు||

చరనం 5

ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు       ||నడిపించు||

Lyrics: Rev. Dr. A. B. Masilamani
Tune: Dr Jacob Prabhu
 
Click here to access the PDF version of the chords
 

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s