పల్లవి నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును ఏడాది కోడెలనా - వేలాది పొట్టేళ్ళెనా (2) చరనం 1 వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా (2) గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| చరనం 2 మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో (2) కరుణ చూపి నీ ప్రేమ మార్గాన - నడిపించితివి యేసయ్యా (2) ||ఏడాది|| చరనం 3 విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునా (2) రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించెదను (2) ||ఏడాది|| చరనం 4 గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నేనేమి చెల్లింతును (2) కపట వర్తన లేకున్న హృదయాన్ని - అర్పింతునో యేసయ్యా (2) ||ఏడాది||