రక్షకుడు పుట్టేను బేత్లెహేములో - రారాజై వెలిసేను పశువుల పాకలో (2)
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ
ఆయనే ప్రభువైన క్రీస్తని - ఆయనే ఇమ్మానుయేలని
రారండి పూజించి కీర్తించెదం
దూతలే స్తుతి పాడగా - గొల్లలే ఆరాధించగా (2)
పరిశుద్ధ ప్రభువే - పసివాడై నేడు (2)
పాకలో పరుండే (2) || సర్వోన్నత ||
అంధకారమే తొలగించను - చీకటి బ్రతుకులన్ వెలిగించను (2)
నీతి సూర్యుడె - వెలుగై నేడు (2)
ఇలలొ ఉదయించే (2) || సర్వోన్నత ||
పాపములను బాపను - శాపములను మాపను (2)
దేవాతి దేవుడె గొర్రెపిల్లై (2)
అవతరించె నేడు (2) || సర్వోన్నత ||
Like this:
Like Loading...
Related
[…] Lyrics in English Lyrics in Telugu […]