చాలునయా చాలునయా

చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు - కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి - తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా - నీ కృప చాలు (2)               ||చాలునయా||

జిగటగల ఊభిలో పడియుండగా - నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సొపుతో నన్ను కడుగుము యేసయ్యా - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నా జీవితమంత అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా - నీ కృప చాలు (2)               ||చాలునయా||

బంధువులు స్నేహితులు త్రోసెసినా - తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనె లేదయ్యా - మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా - నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా
ప్రేమా కరుణా - నీ కృప చాలు (2)               ||చాలునయా||

YouTube Link

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s