స్తోత్రం చెల్లింతుము

స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి                 ||స్తోత్రం||

దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2)     ||స్తోత్రం||

గాడాంధకారములో - కన్నీటి లోయలలో
కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి        ||స్తోత్రం|| 

సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగితివి         ||స్తోత్రం||

సీయోను మార్గములో - పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి      ||స్తోత్రం||

సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి      ||స్తోత్రం||

పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా
సద పాడెద హల్లెలూయా - ప్రభుయేసుకే హల్లెలూయా  ||స్తోత్రం||

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s