సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని కిరణాల అరుణోదయం (2)
శ్రమవెలత హృదయాలు వెలుగైనవి
మరణాల తెరచాప మరుగైనది (2) ||సుధా||
లోకాలలో పాపశోకాలలో - ఏకాకినై బ్రతుకు అవినీతినై (2)
శ్రమదాల్చి భువిలోన భూసావళి - ప్రేమానురాగాలు బ్రోచాయని (2)
నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు
నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2)
ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2) ||సుధా||
దివిరాజుగా భువికి దిగినాడని - రవిరాజుగా ఇలను వెలిసాడని (2)
పరలోక భవనాలు తెరిచాయని - నవలోక గగనాలు పిలిచాయని (2)
నమ్మినవారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు
నిత్యరక్షణ సత్యమార్గము ఇలపై ఆ క్రీస్తే (2)
ఆ జన్మమే - అనుబంధమే - అనురాగమే - ఆనందమే (2) ||సుధా||
Like this:
Like Loading...
Related